ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి: వీహెచ్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఖమ్మం జిల్లా బయ్యారంలోని ఇనుప ఖనిజం గనులను కేటాయించడం సంతోషకరమని ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. సిద్ధిపేటలో ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. గనులు కేటాయించినందున విశాఖ స్టీల్ ఖమ్మం జిల్లాలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని హనుమంతరావు కోరారు. దీనివల్ల స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని వీహెచ్ కోరారు.